ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. యూఆర్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. వివరాలకు www.hindustanpetroleum.com వెబ్సైట్లో సంప్రదించాలి.